ETV Bharat / state

చరిత్రలోనే ఏడోసారి... భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

భద్రాచలం వద్ద... గోదావరి ఉగ్రరూపాన్ని కొనసాగిస్తోంది. 20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంతో.. వడి వడిగా ముందుకు సాగుతోంది. పరివాహక ప్రాంతాలను చుట్టుముట్టేస్తోంది. గోదావరి చరిత్రలోనే ఏడోసారి.. 61 అడుగులు దాటిన నీటి మట్టం.. రామాలయం కరకట్ట ప్రాంతాలను ముంచేసింది. వరద ఉద్ధృతి మరింత పెరుగుతుందంటూ సీడబ్ల్యూసీ ప్రకటించటంతో.. ముంపు మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

చరిత్రలోనే ఏడోసారి... భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి

author img

By

Published : Aug 18, 2020, 5:28 AM IST

అల్పపీడన ప్రభావం సహా.. పై నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ఎగసిపడుతోంది. దాదాపు 20 లక్షల క్యూసెక్కుల వరద.. దిగువ ప్రాంతాలను చుట్టేస్తోంది. సోమవారం సాయంత్రం వరకు అత్యంత ప్రమాదకరంగా ఉన్న నీటి మట్టం.. తర్వాత నెమ్మదిగా వేగం తగ్గింది. ప్రస్తుతం 61 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతోంది. భద్రాచలం వద్ద 61 అడుగులకు చేరడం ఇది ఏడోసారి. దాదాపు ఏడేళ్ల తర్వాత.. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కల్యాణ కట్ట, స్నాన ఘట్టాలు... శ్మాశాన వాటిక దిగువన ఉన్న విస్టా కాంప్లెక్స్, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ.... వరద నీటిలో మునిగిపోయాయి. భద్రాద్రి రామయ్య సన్నిధి వద్ద... తూర్పు మెట్లకు వరద పోటెత్తింది. అన్నదాన సత్రం.... వరద నీటిలో మునిగిపోయింది.

ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు

గోదావరి ఉద్ధృతితో పరివాహక ప్రాంతాలు.. ముంపు మండలాలు గజగజ వణికిపోతున్నాయి. భద్రాచలం పట్టణంలోని పలు కాలనీలు... వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. సరోజినీ వృద్ధాశ్రమంలోకి రెండు అడుగుల మేర వరద నీరు చేరింది. సుమారు 60 మంది వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని మండలాలల్లో పదుల సంఖ్యలో గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఏజెన్సీ మండలాల్లోని చాలా గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. జిల్లాలోని నాగారం వంతెనపై గండి పడటంతో... భద్రాచలం నుంచి ఖమ్మంకు ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపివేశారు. మణుగూరు మండలంలోని కొండయిగూడెం శివాలయాన్ని గోదావరి నది చుట్టుముట్టింది.

వీలీన మండలాల్లో అలుముకున్న చీకట్లు

ముంపు బాధితులను అధికారులు.. పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లాలో దాదాపు 50 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇంటెక్​వెల్​లోకి వరద నీరు వచ్చి చేరింది. చర్ల, దుమ్ముగూడెంలో ముంపునకు గురైన కాలనీల ప్రజలను.. అధికారులు దగ్గరలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అటు ఏపీలో విలీనమైన.. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో... రెండు రోజుల నుంచి విద్యుత్తు నిలిపివేశారు. ఆయా మండలాలకు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఇదీ చూడండి: పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.