ETV Bharat / state

భద్రాద్రి రామయ్య కల్యాణానికి కోటి గోటి తలంబ్రాల బహూకరణ - Crore Talambras

Bhadrachala Sri Rama Kalyanam Mahotsavam: శ్రీరామ నవమి సమీపిస్తుండటంతో భక్తులు స్వామివారికి కానుకలు సమర్పించుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్త బృందం భద్రాచల సీతారామ కల్యాణానికి గోటితో ఒలిచిన నాలుగు క్వింటాళ్ల తలంబ్రాలను సమర్పించారు. నెల్లూరుకు చెందిన భక్తులు ముత్యాలతో చేసిన వస్త్రాలను బహూకరించారు.

కోటి గోటీ తలంబ్రాల బహుకరణ
కోటి గోటీ తలంబ్రాల బహుకరణ
author img

By

Published : Mar 26, 2023, 5:24 PM IST

Updated : Mar 26, 2023, 6:32 PM IST

Bhadrachala Sri Rama Kalyanam Mahotsavam: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి గోటితో ఒలిచిన నాలుగు క్వింటాళ్ల తలంబ్రాలను ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, నెల్లూరు, కనిగిరి జిల్లాల నుంచి.. తెలంగాణలోని కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వచ్చిన భక్త బృందాలు స్వామివారికి సమర్పించారు. 11 ఏళ్లుగా ఈ వరి విత్తనాలను భద్రాద్రిలో పూజలు చేయించి తూర్పు గోదావరిలోని కోరుకొండలో ప్రత్యేకంగా పంట పండిస్తున్నారు.

ఈ వడ్లను వేలాది మంది భక్తుల చేత ఒలిపించి రామయ్య సన్నిధికి అప్పగిస్తున్నారు. 12వ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో ఒలిచిన తలంబ్రాలను రామయ్య సన్నిధికి అందించారు. ప్రతి ఏడాది సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు అందించడం సంతోషంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి 30 లక్షల విలువ గల ముత్యాల వస్త్రాలను నెల్లూరుకు చెందిన భక్తులు సమర్పించారు. ప్రతి సోమవారం ప్రధాన ఆలయంలోని మూలవరులకు, ఉపాలయంలోని లక్ష్మీ తాయారు అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి ముత్తంగి అలంకరణ ఉంటుంది. ప్రత్యేకంగా తయారు చేసిన ముత్యాల వస్త్రాలతో అలంకరించిన స్వామి వారిని ముత్తంగి అలంకారం అంటారు.

ముత్యాలతో చేసిన వస్త్రాలు
ముత్యాలతో చేసిన వస్త్రాలు

గతంలో భక్తులు సమర్పించిన ముత్యాల వస్త్రాలు పాతవి అవటంతో నెల్లూరుకు చెందిన భక్తులు నూతన ముత్యాల వస్త్రాలు తయారు చేయించి దేవస్థానానికి అందించారు. రాగి రేకులపై, ముత్యాలు, రత్నాలతో చాలా కాలం మన్నేలా వీటిని తిరుపతిలోని పండితుల చేత తయారు చేయించారు. ఈరోజు యాగశాలలో ప్రత్యేక పూజలు చేయించి వీటిని ఆలయానికి అందజేశారు. ఇప్పటి నుంచి ప్రతి సోమవారం ఈ ముత్యాల వస్త్రాలను సీతారాములకు అలంకరించనున్నారు.

"లోక కల్యాణార్థం శ్రీరామ తత్వాన్ని దేశమంతా ప్రచారం చేయడంలో భాగంగా తొలుత వడ్లను భద్రాచల శ్రీరామ సన్నిధానంలో పూజ చేయించి తూర్పు గోదావరి జిల్లా అచ్యుతాపురంలో ఈ వడ్లతో పంట పండిస్తాము. పండిన వడ్లను గోటితో ఒలిపించి మూడు రాష్ట్రాలలో ఉన్న అయోధ్య, భద్రాచలం, ఒంటిమిట్ట సీతారామ కల్యాణానికి తలంబ్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు భద్రాచల రామాలయం ఈవో చేతుల మీదుగా స్వామి వారి కల్యాణానికి గోటితో ఒలిచిన నాలుగు క్వింటాళ్ల తలంబ్రాలను సమర్పించడం జరిగింది". - కల్యాణ అప్పారావు , అధ్యక్షుడు శ్రీకృష్ణ చైతన్య సంఘం, కోరుకొండ తూర్పుగోదావరి జిల్లా

ఇవీ చదవండి:

Last Updated : Mar 26, 2023, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.