భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 23 మండలాల్లో ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో జరుగుతున్న పనులు అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శంగా నిలుస్తున్నాయి. నిబంధనల ప్రకారం కొలతలు, మీటర్ల వెడల్పు, మీటర్ల పొడవుతో మట్టి తీయాల్సి ఉండగా.. పని జరిగే సమయంలో క్షేత్రస్థాయిలో సాంకేతిక సిబ్బంది పర్యవేక్షణ లోక పనులు మొక్కుబడిగా జరిపి మమా అనిపిస్తున్నారు.
నిత్యం పర్యవేక్షణ చేస్తున్నాం
ఉపాధి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నామని.. మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఏపీవో పరిశీలన చేస్తున్నారని ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు... సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కూలీలు పనులు చేస్తున్నారని డీఆర్డీ అధికారి మధుసూదన్‌రాజు వెల్లడించారు.