భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నవజాత శిశువు చనిపోకముందే చనిపోయిందని కవర్‌లో వేసి బంధువులకు అప్పగించారు. ఏపీ తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం నరసింహపురానికి చెందిన సునీత ఆరు నెలల గర్భిణి. నొప్పులు రావడంతో చింతూరులోని ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన సునీతకు వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో కవలలు ఉన్నారని తెలిపారు. అందులో ఒకరు చనిపోయారని చెప్పారు. ఆపరేషన్ చేసి బయటకు తీశారు. తర్వాత ఇద్దరు శిశువులు చనిపోయారని కవర్‌లో వేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒక గంట తర్వాత కవరు కదలడంతో విప్పి చూడగా శిశువు బతికే ఉన్నాడని కుటుంబసభ్యులు గుర్తించారు. వైద్యుల నిర్లక్ష్యంపై వాగ్వాదానికి దిగారు. బాబు 500 గ్రాముల బరువు ఉన్నాడని మెరుగైన చికిత్స కోసం వరంగల్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి కేటీఆర్