ETV Bharat / state

Danger Queries: ప్రమాదాలకు నెలవుగా క్వారీ గుంతలు.. ప్రేక్షకపాత్ర పోషిస్తున్న అధికారులు - bhadradri kothagudem district latest news

ఏటా కోట్లల్లో సాగే క్రషర్ క్వారీల(Crusher Queries) నిర్వహణ గుత్తేదారులకు కాసుల పంట పండిస్తుంది. లీజుల పేరిట కంకర తవ్వుకుని జేబులు నింపుకుంటున్న గుత్తేదారులు ప్రకృతిని నాశనం చేస్తున్నారు. లీజు తీరాక గుంతల్ని మట్టితో పూడ్చాల్సిన యజమానులు నిబంధనలకు పాతరేస్తున్నారు. దీంతో ఈ గుంతలు ప్రమాదాలకు(Danger Queries) నెలవుగా మారుతున్నాయి. గత రెండేళ్లలో 8 మంది గుంతల్లో పడి మరణించినా... అధికారులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.

Danger Queries
Danger Queries
author img

By

Published : Nov 14, 2021, 8:02 PM IST

పాల్వంచ మండలంలోని తొగ్గూడెంలో ప్రమాదకరంగా మారిన క్రషర్ క్వారీ గుంతలు

క్వారీ నిర్వహకుల డబ్బుకు లొంగిపోయిన అధికారులు ప్రకృతి ఆనవాళ్లు కోల్పోతుంటే ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఏటా కోట్ల టర్నోవర్‌తో సాగే కంకర క్రషర్ క్వారీల నిర్వహణ గుత్తేదారులకు కాసుల పంట పండిస్తోంది. లీజుల పేరిట కంకర తవ్వుకుని లాభాలు గడించిన గుత్తేదారులు.. అడవిని బందీగా చేసుకుని కొండలను పిండి చేస్తున్నారు. లీజు తీరాక గుంతల్ని మట్టితో పూడ్చాల్సిన యజమానులు నిబంధనలకు పాతరేస్తున్నారు. దీంతో ఈ గుంతలు ప్రమాదాలకు(Danger Crusher Queries) దారి తీస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం(Danger Queries in palwancha mandal) తొగ్గూడెంలో గల గుట్టల్ని గుత్తేదారులు యథేచ్చగా తవ్వుతున్నారు.

ప్రమాదాలకు నెలవుగా క్వారీ గుంతలు...

లీజుల పేరిట కోట్లు తెచ్చిపెట్టే కంకర గుట్టలను క్వారీ నిర్వహకులు నాశనం చేస్తుంటే... అటవీ సంపదతో తులతూగే తొగ్గూడెం నేడు కళతప్పుతుంది. కంకర తవ్వకాలకు ఇచ్చిన అనుమతులకు మించి భూమిని తొలిచేస్తున్నారు. పరిసర ప్రాంతాలన్నీ లోయలను తలపిస్తున్నాయి. తొగ్గూడెం ఆనుకుని ప్రస్తుతం ఆరు కంకర క్వారీలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 20కిపైనే క్వారీల లీజు గడువు పూర్తయినా.. ఆ గుంతలు పూడ్చకపోవడం(Danger Queries in bhadradri kothagudem district) ప్రమాదాలకు కారణమవుతోంది.

నిబంధనలు ఉల్లంఘించిన గుత్తేదారులు..

తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో మట్టి పూడ్చటం లీజుకు తీసుకున్న గుత్తేదారులే చేయాలని నిబంధనలు ఉన్నా... ఎక్కడా అమలు కావడం లేదు. పెద్దపెద్ద బావులు, చెరువుల్ని తలపిస్తూ రెండెకరాల విస్తీర్ణంలో గుంతలు విస్తరించి ఉన్నాయి. ప్రమాదకరంగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి పూడ్చకుండా ఉన్న గుంతలు జనం ఉసురుతీస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని అంటున్నారు. గుత్తేదారుల డబ్బుకు లొంగిపోయిన అధికారులు ప్రమాదాల సమాచారం బయటకు పొక్కకుండా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రెండేళ్ల కాలంలోనే 8 మంది మృతి..

తొగ్గూడెం కంకర క్వారీల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. కేవలం రెండేళ్ల కాలంలోనే ప్రమాదవశాత్తు గుంతల్లో(Danger Queries in bhadradri kothagudem district) పడి సుమారు 8 మంది మృత్యువాతపడ్డారు. స్థానిక కూలీలతోపాటు ఉపాధి కోసం ఒడిశా నుంచి వచ్చిన వారు సైతం మృతిచెందిన వారిలో ఉన్నారు. గుత్తేదారుల డబ్బుకు లొంగిపోయిన అధికారులు ప్రమాదాల సమాచారం బయటకు పొక్కకుండా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

ఇదీ చదవండి: National rural employment guarantee news: ఉపాధిహామీ పథకం అమలులో కొత్త షరతులు ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.