భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో బీమ్లాతండా, అన్నారుపాడు, దుబ్బతండా, పడమటి నర్సాపురం, రామచంద్రాపురం, ఎలకలొడ్డు గ్రామాలకు 320 రెండు పడక గదుల ఇళ్లు మంజూరయ్యాయి. దుబ్బతండా మినహా ఎక్కడా నిర్మాణాలు పూర్తికాలేదు. ఎన్నికల కోడ్ ముగియడం వల్ల ప్రభుత్వం ఇళ్లు కేటాయిస్తుందని బీమ్లాతండాలో ముందస్తుగానే గ్రామస్థులు రాత్రికి రాత్రి ఇళ్లలోకి చేరారు. ఇళ్లకు తోరణాలు కట్టుకుని తెరాస జెండాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలు ఏర్పాటు చేసుకున్నారు. వర్షాకాలం పూరిళ్లలో ఉండలేక ముందుగానే వచ్చామని చెబుతున్నారు. అధికారులు మాత్రం నిర్మాణాలు పూర్తి కాలేదని, అయిన తర్వాత గుర్తించిన లబ్ధిదారులకు మాత్రమే ఇస్తామని ప్రకటించారు. గుత్తేదారులే ఇంకా తమకు కేటాయించలేదని అధికారులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య సానుకూలంగా పరిష్కరిస్తామని ఏఈ సుబ్బరాజు తెలిపారు.
ఇవీ చూడండి: 'అయారాం... గయారాం సంస్కృతి కాంగ్రెస్‌దే'