రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట సీపీఎం నేతలు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కరోనా పరీక్షలు, వైద్యం పేరుతో ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు వైద్యశాలలపై ప్రభుత్వం నియంత్రణ విధించాలని డిమాండ్ చేశారు.
పేద మధ్య తరగతి ప్రజలకు కరోనా వైద్యం అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డీఎంహెచ్‌వోకు వినతిపత్రం అందజేశారు.