ETV Bharat / state

బెల్టుషాపులు తొలగించాలని ప్రజాసంఘాల ధర్నా - ఇల్లందు వార్తలు

ఇల్లందు మండల కేంద్రంలో బెల్టు షాపులను తొలగించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎక్సైజ్​ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. బెల్టు షాపుల వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజల సంపాదన అంతా మద్యానికి ఖర్చు పెడుతున్నారని, ఫలితంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPIM Affiliated Organisations Protest Against Belt Shops
బెల్టుషాపులు తొలగించాలని ప్రజాసంఘాల ధర్నా
author img

By

Published : Jul 18, 2020, 10:33 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కేంద్రంలో బెల్టుషాపులను తొలగించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. బెల్టుషాపుల వల్ల పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాగుబోతుల వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెల్టుషాపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు ఎక్సైజ్ కార్యాలయం వద్ద సీపీఎం అనుబంధ ఐద్వా ,వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ , సీఐటీయుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతూ.. బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారని నాయకులు నబి ఆరోపించారు. ఆందోళన కార్యక్రమం అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్, వెంకట్, కాంతమ్మ, పద్మ, మోహన్, సురేష్, రాజేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.