ETV Bharat / state

అడవుల్లో పేలిన తూటా... ముగ్గురు మావోయిస్టులు మృతి

భద్రాద్రి అడవుల్లో మళ్లీ తూటా పేలింది. ఓ వైపు మావోయిస్టుల చర్యలు.. పోలీసుల ప్రతి చర్యలతో అటవీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. మళ్లీ అడవుల్లో తుపాకుల మోత మోగింది. భద్రాద్రి జిల్లాలో బుధవారం రెండు చోట్ల పోలీసులు-మావోయిస్టుల మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పాల్వంచ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకోగా.. చర్ల అటవీప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మొత్తంగా ఈ నెలలో నాలుగు సార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోలు ప్రాణాలు కోల్పోగా.. తుపాకుల మోతతో గిరిజన ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి.

counter attacks in bhadradri kothagudem
అడవుల్లో పేలిన తూటా... ముగ్గురు మావోయిస్టులు మృతి
author img

By

Published : Sep 24, 2020, 12:34 AM IST

పట్టుకోసం మావోయిస్టులు..వారి అణిచివేత కోసం పోలీసులు ఎవరికి వారే చేస్తున్న ప్రయత్నాలతో అడవిలో అలజడి చెలరేగుతున్న వేళ..భద్రాద్రి అడవుల్లో మరోసారి తూటా పేలింది. భద్రాద్రి జిల్లాలో బుధవారం రెండు చోట్ల పోలీసులు-మావోయిస్టుల మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పాల్వంచ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకోగా.. చర్ల అటవీప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. చెన్నాపురం అటవీప్రాంతంలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

పేలుళ్లకు ఉపయోగించే సామగ్రి స్వాధీనం

కాల్పులు జరిగిన ప్రదేశంలో ఒక 8 ఎంఎం రైఫిల్, పేలుళ్లకు ఉపయోగించే సామాగ్రి ఒక కిట్ బ్యాగుతోపాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రకటించారు. ఎదురుకాల్పుల నుంచి మరికొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు వెల్లడించారు. అంతకుముందు మధ్యాహ్నం సమయంలో జిల్లాలోని పాల్వంచ అటవీప్రాంతంలోనూ మావోయిస్టులు- జిల్లా పోలీస్ పార్టీల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఒక ఎస్​బీబీఎల్ తుపాకి, కిట్ బ్యాగులు, సోలార్ ప్లేట్లు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒక్కనెలలోనే ఆరుగురు..

జిల్లాలో జూలై 15న మొదలైన ఎదురుకాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. తొలుత జరిగిన మణుగూరు మల్లెతోగు అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకోగా... దాదాపు నెలన్నర రోజులకే గుండాల అటవీ ప్రాంతంలో తూటా పేలింది. సెప్టెంబర్ 3న జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందగా.. మరొకరు పరారయ్యారు. సెప్టెంబరు 7న చర్ల మండలం పూసుగుప్ప అటవీప్రాంతంలో ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. అంతేకాదు... ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు.

2 నెలలుగా ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారం మేరకు దాదాపు 2 నెలలుగా పోలీసులు ఏజెన్సీ ప్రాంతాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. ఏజెన్సీ ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేయడంతోపాటు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన యాక్షన్ టీం కమాండర్ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసుల అప్రమత్తమై గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదే సమయంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల చర్ల మండలంలో రెండు సార్లు మందుపాతర అమర్చగా పోలీసులు వారి చర్యల్ని భగ్నం చేశారు. ఇక ఈ నెల 21 నుంచి 27 వరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ పోలీసులకు గట్టి సవాల్ విసిరేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మావోలను కట్టడి చేసేందుకు అన్ని వ్యూహాలతో సిద్ధంగా ఉన్న పోలీసులు.. వరుస ఎన్​కౌంటర్లతో మావోయిస్టులపై పైచేయి సాధిస్తున్నారు.

బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు

దాదాపు రెండు నెలలుగా తూటా చప్పుళ్లు, పోలీసులు- మావోయిస్టుల ప్రచ్చన్నయుద్ధంతో భద్రాద్రి జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భయానక వాతావరణం ఏర్పడుతోంది. చర్ల, మణుగూరు, పాల్వంచ ఏరియా అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోతలు దద్దరిల్లడం వల్ల గిరిజన ప్రాంతాలన్నీ ఉలిక్కిపడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఇవీ చూడండి: చర్ల అడవుల్లో ఎన్​కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.