భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మాణిక్యరం పంచాయితీ దేశ్యతండాలో అగ్నిప్రమాదంలో లక్షా ఇరవై వేల విలువచేసే మొక్కజొన్న పంట దగ్ధమైంది. ఇప్పటికే నాలుగు గ్రామాల్లో అగ్ని ప్రమాదం కారణంగా మొక్కజొన్న పంటలు కాలిపోగా.. విద్యుత్ తీగల కారణంగానే ప్రమాదం జరిగిందని.. పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
లస్కర్, కౌసల్యకు చెందిన పంటలు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని వాపోయారు. కుప్ప వేసి ఉన్న పంటలు ఎండ వేడిమితో ఎండిపోయి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. వేలాడే విద్యుత్ తీగలు, దూరం దూరంగా ఉన్న స్తంభాలు గాలి తీవ్రతతో ప్రమాదాలకు కారణం అవుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. నష్టం అంచనా వేసినప్పటికీ.. ఆదుకునే సహాయక చర్యలు కొనసాగడం లేదని వెల్లడించారు.
ఇదీ చూడండి : నీటిసంపులో పడేసి పసికందును చంపిన తండ్రి