భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో అదనపు కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆక్సిజన్ సదుపాయం ఉన్న యాభై పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించగా... 100 పడకలకు పెంచాలని అధికారులను ఆదేశించారు. పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వైద్య సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎంపీవో అరుణ్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో 30 పడకల ఆస్పత్రిని తనిఖీ చేసి వ్యాక్సినేషన్, కరోనా పరీక్షలను పరిశీలించారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతతో 8 మంది కరోనా రోగులు మృతి