మందలపు ట్రస్ట్, కోనేరు ట్రస్ట్, భాజపా సంయుక్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సుమారు 2500 మందికి నిత్యావసరాల పంపిణీ చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ చేతుల మీదుగా సరుకులు అందించారు.
కరోనా సమయంలో మేమున్నామంటూ కోనేరు ట్రస్ట్, భాజపా కలిసి ఇప్పటివరకు 18 వేల మందికి పైగా నిత్యావసరాలు పంపిణీ చేశాయని సత్యనారాయణ తెలిపారు. కరోనా సమయంలో ఆదాయాన్ని కోల్పోయిన వారిని గుర్తించి వితరణ చేపట్టినట్లు వివరించారు.