ETV Bharat / state

కరోనా బాధితుడికి కాలం చెల్లిన మందులు... కలెక్టరుకు ఫిర్యాదు - కరోనా చికిత్స

కరోనా బాధితుడికి కాలం చెల్లిన మందులు... కలెక్టరుకు ఫిర్యాదు

author img

By

Published : Jul 6, 2020, 9:09 AM IST

Updated : Jul 6, 2020, 11:00 AM IST

08:54 July 06

కరోనా బాధితుడికి కాలం చెల్లిన మందులు... కలెక్టరుకు ఫిర్యాదు

కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో జాగ్రత్తగా ఉండాలని సూచించే వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైరస్​ సోకిన వ్యక్తికి కాలం చెల్లిన మాత్రలు ఇచ్చి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వాహనం కూడా దారిమధ్యలో పంక్చర్​ అయింది.  

భద్రాచలంలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో అప్రమత్తమవ్వాల్సిన వైద్య అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓ వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయిన రోజే వైద్య సిబ్బంది కాలం చెల్లిన మాత్రలు ఇచ్చారు. డాక్టర్లపై నమ్మకంతో ఆ రోగి మాత్రలు వేసుకున్నాడు.  వైద్య సిబ్బంది తీరును గమనించిన బాధితుడు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు వెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయాలని అధికారులను కోరాడు. మూడు రోజుల నుంచి విజ్ఞప్తి చేస్తే ఆదివారం సాయంత్రం వాహనాన్ని సిద్ధం చేశారు.  

రోగితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రికి పయనమయ్యారు. కొత్తగూడెం సుజాతనగర్ వద్దకు రాగానే వాహనం పంక్చరైంది. వైరస్​ సోకిన వ్యక్తి ఎక్కువ సేపు బయట ఉండకూడదని తెలిసినా.. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వేరే వాహనం ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది తీరుపై బాధితుడు  కలెక్టర్​కు ఫిర్యాదు చేశాడు.

వైరస్ బాధితుడి పట్ల అధికారులు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సోకిన వ్యక్తి పట్లే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మిగితా వారి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

Last Updated : Jul 6, 2020, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.