రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలపై లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యాచించి పొట్ట నింపుకునే వాళ్ల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అనేక మంది యాచకులు, నిరు పేదలు ఆకలితో అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు.
పట్టణంలోని పలు కూడళ్ల వద్ద సాయం కోసం నిరీక్షించే వీరికి.... స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీలు రోజూ ఆహారాన్ని అందిస్తూ ఉదారతను చాటుకుంటున్నాయి. భోజన ప్యాకెట్ల కోసం ఉదయం 8 గంటల నుంచే బారులు తీరుతున్నారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్