భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 48 అడుగులకు చేరింది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యాక్‌వాటర్ బయటకు పంపించే మోటార్లు పాడవడం వల్ల రామాలయ అన్నదాన సత్రం వద్ద మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది. దుకాణదారులు వారి దుకాణాలు మూసివేశారు. లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అన్నదాన సత్రం వద్ద దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
- ఇదీ చూడండి : పొలం పనులకు వెళ్లి వాగులో చిక్కుకున్నారు