పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ హెలికాఫ్టర్ ద్వారా దిగే ప్రదేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. మంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.