భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం దండుమిట్ట తండా, పడమటి నర్సాపురం పరిసరాల్లో ఎలుగుబంటి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. సాయంత్రం వేళలో దండుమిట్ట తండా వద్ద ఎలుగుబంటి ఖమ్మం- కొత్తగూడెం ప్రధాన రహదారి దాటుతుండగా చూసిన ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
పడమటి నర్సాపురం సమీపంలోని ఖాళీగా ఉన్న రెండుపడక గదుల ఇళ్లలో చొరబడిందని సమాచారంతో అటవీశాఖ సిబ్బంది తనిఖీలు చేశారు. ఆర్‌ఎఫ్‌ఓ నాగసాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎలుగు జాడ కోసం సిబ్బంది గాలిస్తున్నారు. రాత్రి ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి కాపాడుకునేందుకు పోలీసుల వినూత్న కార్యక్రమం