భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని బీసీ గురుకుల బాలుర వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాడైపోయిన కూరగాయలతో వంట చేయడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వసతి గృహం చుట్టుపక్కల దుర్గంధం ఉండటం వల్ల విద్యార్థులు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు గురుకులాలను పర్యవేక్షించకపోవడం వల్లే ఈ పరిస్థితులు వస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
- ఇదీ చూడండి : ఇంజినీర్లతో సమీక్షించిన సీఎం కేసీఆర్