ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామగిరిలో విద్యుదాఘాతంతో కడదారపు జ్యోతి మరణించింది. దుస్తులు ఉతికిన తర్వాత మోటార్‌ను నిలిపివేసేందుకు ప్రయత్నించింది. వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. అప్రమత్రమైన కుటుంబసభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు.
ఇవీ చూడండి: బాలికపై అత్యాచారయత్నం.. నిందితులకు దేహశుద్ధి