ఖరీఫ్ ఆరంభంలోనే అడవి పందులు.. రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. వర్షాకాలం మొదలు కాగానే రైతులంతా తమ పొలాలను సాగు చేయడం ప్రారంభించారు. పత్తి, జొన్న, కంది విత్తనాలను వేశారు. కానీ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంపూర్ శివారులో పదుల సంఖ్యలో అడవి పందులు గుంపులుగా పొలాల్లో వీరవిహారం చేస్తున్నాయి.
భూమిని తోడి మరీ వేసిన పత్తి, కంది గింజలు తింటున్నాయని రైతులు వాపోతున్నారు. వాటిని దూర ప్రాంతాలకు తరలించి.. పందుల బెడద లేకుండా పంటలు కాపాడాలని అధికారులను వేడుకున్నారు.
ఇదీ చదవండి: Haritha haram: ఏడో విడత.. 'హరిత' సన్నద్ధత