ETV Bharat / state

రుణాల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగులు - ఆదిలాబాద్‌ జిల్లా పరిశ్రమల శాఖలో ఉద్యోగుల కొరత

రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు...ప్రభుత్వం చేస్తున్న కృషికి ఉద్యోగుల కొరత ప్రతిబంధకంగా మారుతోంది. క్షేత్రస్థాయిలో స్వయం ఉపాధి పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేసే ఇండస్ట్రియల్‌ ప్రమోషన్ అధికారుల పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల... ఆశించిన ప్రయోజనం సకాలంలో నెరవేరకుండాపోతోంది. ఉన్న సిబ్బంది తమ విధులు నిర్వర్తించే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా పరిశ్రమల శాఖలో పనిచేస్తున్నవాళ్లు శ్రమించాల్సి వస్తోందని వాపోతున్నారు.

unemployed-people-wandering-around-the-office-for-loans-at-adilabad-district
రుణాల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగులు
author img

By

Published : Sep 3, 2020, 3:18 PM IST

Updated : Sep 3, 2020, 4:23 PM IST

రుణాల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగులు

ఆదిలాబాద్‌ జిల్లా పరిశ్రమల శాఖలో ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒకే ఉద్యోగి సూపరింటెండ్‌గానూ... జూనియర్ అసిస్టెంట్‌గాను విధులు నిర్వహిస్తున్నారు. సూపరింటెండెంట్‌ పోస్టులో ఉండి... జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారంటేనే పరిస్థితి అర్థమవుతోంది. జిల్లా పరిశ్రమల కార్యాలయంలో కీలకమైన మూడు ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ అధికారుల పోస్టులతోపాటు జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్లు, స్టెనో, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల పునర్విభజన తరువాత ఈ ఖాళీలు భర్తీ కాలేదు. అన్ని విధులు తామే చేయాల్సి వస్తోందనే భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంటే....ఆశించిన పని కావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

10 పోస్టులు భర్తీకాలేదు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్‌, ఇచ్చోడ, ఉట్నూర్‌, నిర్మల్, భైంసా, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షెట్టిపేట కేంద్రాలుగా ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ అధికారుల పోస్టులు ఉండేవి. జిల్లాల పునర్విభజన తరువాత కేవలం మంచిర్యాల కేంద్రం మినహా మిగిలిన 10 పోస్టులు భర్తీ కాలేదు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సమన్వయం చేసే విధుల నిర్వహణ అవరోధంగా మారుతోంది. స్వయం ఉపాధి కోసం వస్తున్న ఆన్‌లైన్‌ దరఖాస్తులను పరిశీలించే పరిస్థితి కనిపించడం లేదు. గ్రామ, మండల సర్వసభ్య సమావేశాల్లో పారిశ్రామికీకరణ కోసం ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ రుణాల వివరాలు తెలిపేవాళ్లు లేకుండా పోయారు. ఆ పనులు చేయాల్సిన తాము కూడా అసిస్టెంట్ల పాత్రకే పరిమితం కావాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల పరిధిలోని పరిశ్రమలశాఖలో చివరికి నాల్గోతరగతి ఉద్యోగ పోస్టులూ భర్తీ కావడం లేదు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు కలిపి ఒక్కరే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ విధులు నిర్వహించడం ప్రభుత్వం కల్పించే రాయితీ రుణాల లక్ష్యసాధనకు అవరోధంగా మారింది.

ఇదీ చూడండి : విషాదం.. ఫ్యాన్​కు ఉరేసుకుని దంపతుల బలవన్మరణం

Last Updated : Sep 3, 2020, 4:23 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.