ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఓ యువకుడికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. హాసనాపూర్ను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 15 మందిని ఆదిలాబాద్‌కు తరలించారు.
హాసనాపూర్ గ్రామంలో ఎవరు బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇంటింటికి తిరుగుతూ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది వెళ్లి కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి అనారోగ్యం బారిన పడ్డ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా ఉప విద్యాధికారి పేర్కొన్నారు.
ఇవీచూడండి:గ్రామాల మధ్య ముళ్ల కంచెలు...ఘర్షణలు