ఆకతాయిలు ఎవరైనా వేధిస్తే తిరగబడాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సూచించారు. జిల్లా కేంద్రంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. యువత ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బాగా చదివి ఉద్యోగాలు సాధించాలన్నారు. ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న వారి జోలికి వస్తే పోరాటాలు చేయాలని సూచించారు. ఆదివాసీల పట్ల తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని దుయ్యబట్టారు. వేడుకల్లో భాగంగా పోరాటయోధుడు కుమురం భీం జీవిత చరిత్రపై విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అలరించింది.
ఇవీ చూడండి: జమ్ముకశ్మీర్ కోసం ప్రాణాలైనా అర్పిస్తా: షా