సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశరావు బదిలీ పట్ల రామకృష్ణాపూర్లో ఆదిలాబాద్ జిల్లా సూపర్ బజార్ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కోసి అందరికీ పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. బదిలీ అయిన అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
సదరు అధికారి హయాంలో కమీషన్ల కోసం ఆశపడి అవసరం లేకపోయినా సరకులు కొనుగోలు చేశారని సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ రాములు మండిపడ్డారు. దీనివల్ల సంస్థకు నష్టం చేకూరిందని తెలిపారు. ఈ విషయమై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక సిబ్బందిని కూడా తీవ్ర వేధింపులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.