రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సమత కేసు విచారణ...ఈ నెల 26కి వాయిదా పడింది. ఆదిలాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో రెండో రోజు సాక్షుల విచారణలో భాగంగా... ప్రాసిక్యూషన్ తరపున అదనపు పీపీ రమణారెడ్డి.. ముగ్గురు సాక్షులను ప్రవేశ పెట్టగా... డిఫెన్స్ న్యాయవాది రహీం క్రాస్ ఎగ్జామిన్ చేశారు. సాక్షుల విచారణ అనంతరం జడ్జి కేసును గురువారానికి వాయిదావేశారు.
వరంగల్ రేంజీ ఐజీ నాగిరెడ్డి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ ఎస్పీలు విష్ణు ఎస్.వారియర్, మల్లారెడ్డి కోర్టుకు వచ్చారు. విచారణ ప్రారంభం కంటే ముందే కోర్టులో సమతకేసు నిందితులు షేక్ బాబూ, షేక్ షాబుద్ధీన్, షేక్ మగ్దూంలను హాజరుపరిచి కేసు వాయిదా అనంతరం తిరిగి జిల్లా జైలుకు తరలించారు. సమత కేసులో బాధితులకు న్యాయం జరుగుతుందని వరంగల్ రేంజీ ఐజీ నాగిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నిందితులకు శిక్షపడేలా.. సమగ్రమైన సాక్ష్యాలను కోర్టుకు నివేదించినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: సమత కేసులో సాక్షులను విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు