విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆదిలాబాద్లో సంబంధిత శాఖ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. భోజన విరామ సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్రం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే రైతులకు ఉచిత కరెంట్ అమలు గగనమేనని ఉద్యోగుల సంఘం నాయకులు సత్తయ్య పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు . తమ ఆందోళనకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.