ETV Bharat / state

ఆ ప్రాంతంలో కొనసాగుతున్న పోలీసుల పికెటింగ్​ - ఫారూఖ్‌ అహ్మద్ కాల్పులు

ఆదిలాబాద్‌లోని తాటిగూడలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల ఫారూఖ్‌ అహ్మద్‌ జరిపిన కాల్పుల్లో సయ్యద్‌ జమీర్‌ మృతి చెందడం పట్ల ఆ ప్రాంతంలో పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

police picketing in the thatikonda area adilabad
ఆ ప్రాంతంలో కొనసాగుతున్న పోలీసుల పికెటింగ్​
author img

By

Published : Dec 26, 2020, 9:25 PM IST

ఆ ప్రాంతంలో కొనసాగుతున్న పోలీసుల పికెటింగ్​

ఆదిలాబాద్‌లోని తాటిగూడలో జిల్లా అధ్యక్షులు ఫారూఖ్‌ అహ్మద్‌ జరిపిన కాల్పుల్లో గాయపడి హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్సపొందుతూ.. మరణించిన సయ్యద్‌ జమీర్‌ అంత్యక్రియలు ఆదిలాబాద్‌లో పోలీసు బందోబస్తు మధ్య పూర్తయ్యాయి.

ఈ నెల 18న ఆదిలాబాద్‌లోని తాటిగూడలో జరిగిన కాల్పుల్లో సయ్యద్‌ జమీర్‌తోపాటు.. ఆయన అన్నకొడుకు మొతేసీన్‌కు బుల్లెట్‌ గాయాలు కాగా... మన్నాన్‌కు తల్వార్‌ గాయాలయ్యాయి. అదేరోజు వారికి ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ప్రాథమిక చికిత్స చేసి.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మొతేసీన్‌, మన్నాన్‌ ఆరోగ్యం మెరుగుపడగా.. సయ్యద్‌ జమీర్‌ మృతి చెందడం తాటిగూడలో విషాదం అలముకుంది.

ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. స్వయంగా జిల్లా ఇంఛార్జీగా ఉన్న రామగుండం సీపీ సత్యనారాయణ పరిస్థితులపై ఆరా తీశారు. నిందితులపై త్వరలోనే ఛార్జీషీట్‌ వేస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి : ఆదిలాబాద్​ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.