ETV Bharat / state

కార్పొరేట్ విద్యకు దీటుగా సర్కారీ బడిలో ఆన్​లైన్​ పాఠాలు

author img

By

Published : Jul 23, 2020, 3:34 PM IST

కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అంతర్జాలం అండతో సర్కారీ పాఠశాలలు ఆన్‌లైన్‌ బోధనపై దృష్టి సారించాయి. ఆదిలాబాద్ జిల్లాలో పలు పాఠశాలలు పదో తరగతి విద్యార్థులకు ఆన్​లైన్​ పాఠాలు బోధిస్తున్నాయి.

online classes in govt schools in adialabad district
కార్పొరేట్ విద్యకు దీటుగా సర్కారీ బడిలో ఆన్​లైన్​ పాఠాలు
కార్పొరేట్ విద్యకు దీటుగా సర్కారీ బడిలో ఆన్​లైన్​ పాఠాలు

కరోనా కారణంగా కార్పోరేట్ సంస్థలు నెల రోజుల ముందు నుంచి ఆన్‌లైన్ తరగతులకు శ్రీకారం చుట్టాయి. సర్కారు బడిలో చదివే పేద విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన చేసేందుకు పలువురు ప్రధానోపాధ్యాయులు నడుంబిగించారు. ఈ విషయాన్ని తొలుత విద్యార్థులు, తల్లిదండ్రులను పిలిపించి తమ ఉద్దేశాన్ని వివరించారు. ఎంతమందికి స్మార్ట్‌ఫోన్‌ సౌకర్యం ఉందని ఆరా తీసి.. వారందరితో గ్రూపు తయారు చేసి తొలుత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.

22 పాఠశాలల్లో అంతర్జాల సౌకర్యం

జిల్లాలో 101 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా అంతర్జాల సౌకర్యం ఉన్న 22 పాఠశాలల్లో.... ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకొని విద్యార్థులు నష్టపోకుండా బోధన ప్రారంభించారు. ఆన్‌లైన్ బోధన ఎంతో ఉపయుక్తంగా ఉందని ఆదిలాబాద్ గ్రామీణ మండలం చాంద(టి) ఉన్నత పాఠశాల విద్యార్థులు చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయుల చొరవను కొనియాడుతున్నారు. పిల్లలు ఆన్‌లైన్ తరగతులు శ్రద్ధగా వింటున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. సందేహాలుంటే వాట్సప్ గ్రూపు ద్వారా నివృత్తి చేసుకునేలా ముందుగానే అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్ బోధనలో కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమేనని.. విద్యార్థులు నష్టపోవద్దనే ఉద్దేశంతో బోధనకు శ్రీకారం చుట్టామని వివరించారు.

అవరోధంగా అంతర్జాల సమస్యలు

ఆన్‌లైన్ బోధన పాఠశాలల్లో సత్ఫలితాలిస్తుండటం పట్ల గ్రామస్థులు... ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తున్నారు. అధికారులు మాత్రం మారుమూలలో ఉన్న పాఠశాలల్లో అంతర్జాల సమస్యలతో ఆన్‌లైన్ బోధన కొనసాగించడం కష్టమే అంటున్నారు. ఆన్‌లైన్‌ బోధన సత్ఫలితాలిస్తున్నప్పటికీ అంతర్జాల సమస్యలు అవరోధంగా మారుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులందరికీ ప్రయోజనం కలిగేలా ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.