ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గుంజాలలో పంచాయతీలో హెల్పర్‌గా రాజు పనిచేస్తున్నాడు. గ్రామంలో వీధి దీపాలు బిగించడానికి ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కాడు. స్ట్రీట్‌లైట్స్ వెలిగిస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడం వల్ల అతను అచేతనంగా పడి ఉన్నాడు.
గ్రామస్థులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి నిచ్చెన సహాయంతో రాజును కిందికి దించారు. సమయానికి గమనించడం వల్ల రాజుకు ప్రాణాపాయం తప్పిందని చుట్టుపక్కల వాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన రాజును ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో పెరిగిపోయిన రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్