ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో కరోనా కేసు నమోదైంది. దిల్లీ మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారికి వైద్యపరీక్షలు నిర్వహించగా... అందులో ఓ యువకుడికి పాజిటివ్ వచ్చినట్లు అదనపు డీఎంహెచ్‌వో డా.మనోహర్ తెలిపారు. యువకుడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కరోనా నిర్ధరణతో అప్రమత్తమైన అధికారులు బాధితుని గ్రామంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. యువకుని కుటుంబసభ్యులు 15 మందిని క్వారంటైన్‌కు తరలించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 75 కేసులు