పొచ్చర జలపాతంలో వృద్ధ దంపతుల ఆత్మహత్య - ముక్క సుదర్శన్
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని పొచ్చర జలపాతంలో ఇద్దరూ వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలు కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర జలపాతంలో నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన ముక్క సుదర్శన్, ప్రమీల అనే వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి కుటుంబ తగాదాలు కారణం అయి ఉండొచ్చని తెలుస్తోంది. 60 ఏళ్లున్న మృతులిద్దరూ ఉదయం జలపాతానికి చేరుకొని అక్కడ చాలా సేపు ప్రకృతి అందాలను వీక్షించారు. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో జలపాతంలో దూకినట్లు సమాచారం. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పంజాగుట్టలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం
Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం 9490917560
....
పొచ్చర జలపాతంలో ఇద్దరు వృద్ధ దంపతుల మృతి
....
( ):- ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర జలపాతంలో నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన ముక్క సుదర్శన్, ముక్క ప్రమీల అనే వృద్ధ దంపతులు దుంకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు . కుటుంబ తగాదాలు అయి ఉండొచ్చని తెలిసింది. ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఇద్దరికీ 60 ఏళ్ల వయసు ఉంది. వీరిద్దరు ఉదయం జలపాతానికి చేరుకొని అక్కడ చాలా సేపు ప్రకృతి అందాలను తిలకించి ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో జలపాతంలో దుంకినట్లుగా తెలిసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు. వారికి ఇద్దరు కొడుకులు , ఒక కుమార్తె ఉన్నారు.
Conclusion:.