ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 42కి చేరుకోవడం వల్ల అధికార యంత్రాంగం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో 16, నిర్మల్ జిల్లాలో 19, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 6, మంచిర్యాల జిల్లాలో ఒక్కరికి పాజిటివ్ రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిపై లాఠీలు ఝుళిపిస్తున్నారు.
లాక్‌డౌన్ కాలంలో ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఏమేం జరిగాయంటే..?
మంచిర్యాల ఏసీపీ లక్ష్మీనారాయణ కరోనా పాసుల జారీలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై పోలీస్ శాఖ ఆయనను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్‌చేసింది. ఆదిలాబాద్‌లో అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశాకార్యకర్తలను సర్వే చేయకుండా అడ్డుకోవడం ఆందోళనకు దారితీసింది. ఆదిలాబాద్ మండలం జందాపూర్ గ్రామానికి చెందిన కేశవ్ అనే ఓ రైతు కరోనా నివారణ చర్యల్లో భాగంగా జిల్లా అదనపు పాలనాధికారి సంధ్యారాణికి రూ.20 వేల చెక్కును అందించి తన ఉదారతను చాటుకున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంపై కరోనా పంజా.. సూర్యాపేటలో ఆందోళనకరం