ETV Bharat / state

వైభవంగా నాగోబా జాతర.. తరలివస్తోన్న అడవిబిడ్డలు - girijnala pandaga nagoba

Nagoba Jatara: అదో విశిష్టమైన బతుకుదెరువు. కల్మషం ఎరగని మనస్థత్వం.. ఆచారవ్యవహారాలను ప్రాణపదంగా భావించే జీవన చిత్రం. చెట్టు, పుట్ట, చేను.. సకల జగత్తుకు మూలమని అక్కడి ఆదివాసీల ప్రగాఢ నమ్మకం. ఏడాదికోసారి జరిగే నాగోబా జాతరలోని మెస్రం వంశీయుల ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం!

Nagoba Jatara in adilabad
ఘనంగా ఆదిలాబాద్‌ జిల్లాలో నాగోబా జాతర
author img

By

Published : Jan 24, 2023, 3:26 PM IST

Nagoba Jatara: ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌ వేదికగా వెలిసిన నాగోబా జాతర ఘనంగా జరుగుతోంది. మెస్రం వంశీయుల బతుకులకు ఆలంబన. అరణ్యమే జీవితంగా భావించే ఆదివాసీల బతుకులు.. నాగోబా జాతర సందర్భంగా బాహ్యలోకానికి తెలుస్తోంది. ఏడాది పొడుగున ఎక్కడెక్కడో ఉండే మెస్రం వంశీయులు.. పుష్యమి అమావాస్యలో వచ్చే నాగోబా జాతరలో కలుసుకోవాలనేది ఆదివాసీల ఆచారం.

ఘనంగా ఆదిలాబాద్‌ జిల్లాలో నాగోబా జాతర

జాతరలో ఏమి చేస్తారు: అడవిని నమ్మి బతుకు వెల్లదీసే ఆదివాసీలది కల్మషంలేని హృదయం. నాగోబా జాతర సందర్భంగా.. అందరూ ఎడ్లబండ్లపై వచ్చి.. చెట్ల నీడలో సేదతీరుతారు. కుటుంబసభ్యులు బంధువులను కలుసుకొని కష్టసుఖాలు పంచుకుంటారు. అనంతరం అందరూ కలిసి భోజనాలు చేసి.. జాతరకు వెళ్తారు. అక్కడ వ్యవసాయ పనులకు ఉపయోగపడే వస్తువులు గృహోపయోగానికి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తారు.

జాతరలో సాంప్రదాయాలను కొనసాగిస్తోన్న ఆదీవాసీయులు: పెళ్లయిన ఆడపడుచులను నాగోబా దగ్గర పరిచయం చేయనంత వరకు మెస్రం కోడలిగా గుర్తింపు రాదు. చనిపోయినవారికి నాగోబా జాతరలో కర్మకాండ నిర్వహించనంత వరకు పెద్దల్లో కలవరనే నియమం ఇప్పటికీ చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. రోజు నవధాన్యాలతో వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేయడం వారి ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రతి ఏటా పుష్యమి అమావాస్య రోజున ప్రారంభమయ్యే నాగోబా జాతర తమ జీవితాలను వెలుగువైపు నడిపిస్తుందనేది మెస్రం వంశీయుల విశ్వాసం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.