పుష్యమాసం ప్రారంభమైన జనవరి 21న గోదావరి నది జలం కోసం.. మెస్రం వంశీయులు కాలినడకన బయలుదేరారు. జనవరి 30న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు చేరుకుని గోదావరి వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అక్కడి పవిత్రమైన గంగాజలం తీసుకుని ఈనెల 7న ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం మరుసటి రోజు ఆలయ సమీపంలో మర్రిచెట్టు వద్ద సేదతీరారు.
కృష్ణగూడలోని మాత ఆలయం నుంచి నాగోబా దేవత విగ్రహాలను డోలు వాయిద్యాల నడుమ తీసుకెళ్లారు. అనంతరం వారి వంశంలోని కొత్తకోడలు... గంగాజలంతో మర్రిచెట్టు సమీపాన ఉన్న కోనేరు నుంచి నీటిని తీసుకెళ్లి... నాగోబా ఆలయాన్ని శుద్ధి చేశారు.
- ఇదీ చదవండి : నేటి నుంచి రైతన్నలతో రాహుల్ 'సమావేశాలు'