ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు చేపట్టిన భద్రతను ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించారు. పట్టణంలోని 19 వార్డుల్లో 1,430 వారియర్లను నియమించి... ప్రజలెవరూ బయటకు రాకూడదంటూ మైక్‌లో అవగాహన కల్పిస్తున్నారు.
ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదంటూ ఎమ్మెల్యే జోగురామన్న మైక్‌లో చెబుతూ అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోడ్డుమీదకు రావాలని... నిత్యావసర సరుకులను ఇంటికే పంపించనున్నట్లు ఎమ్మెల్యే భరోసానిచ్చారు.
ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక