కాలుష్య నియంత్రణకు పల్లె ప్రకృతి వనాలు ఎంతగానో దోహదపడుతాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ప్రకృతి వనం పేరిట ప్రతి గ్రామంలో ప్రభుత్వం పార్కు ఏర్పాటు చేస్తుందన్నారు. ఆదిలాబాద్ జిల్లా సోన్మండలం న్యూవెల్మల్ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల మొక్కలను, ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఊయలలను మంత్రి పరిశీలించారు. గ్రీన్ పార్క్ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న పోచమ్మ ఆలయానికి భూమి పూజ చేశారు.
అక్టోబర్ 11న వెల్మల్ బొప్పారంలో నిర్మించిన 400 కేవీ విద్యుత్ స్టేషన్‌ను ప్రారంభం చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. దానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హాజరవుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎంపీపీ మానస హరీశ్ రెడ్డి, జెడ్పీటీసీ జీవన్ రెడ్డి, ఎంపీటీసీ సర్పంచ్ అంకం గంగామణి శ్రీనివాస్, ఎంపీటీసీ నాగయ్య, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో ఉషారాణి, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'అధికారుల్లో పట్టుదలుంటేనే హరిత వనం సాధ్యం'