రైతు బంధు పథకంపై ఎలాంటి అపోహలు వద్దని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్జిల్లా ఉట్నూరులో జడ్పీఛైర్మన్ రాథోడ్ జనార్ధన్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు వర్షాకాలంలో పంటలు వేసుకోవాలని మంత్రి సూచించారు.
రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని సూచించారు. రైతులకు అన్ని రకాల విత్తనాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంత్రిని కలిసి సకాలంలో వేతనాలు చెల్లించాలని... ఏప్రిల్, మే మాసంలో పూర్తి వేతనాలు చెల్లించాలని కోరారు.