పర్యావరణ స్పృహ పెరగటం వల్ల మండపాల్లోనే కాకుండా గృహాల్లోనూ ఆదిలాబాద్ పట్టణవాసులు మట్టి వినాయకుని విగ్రహాలను ప్రతిష్ఠించారు. వినాయక చవితిని పురస్కరించుకుని జిల్లాలో చాలా మంది తమ ఇళ్లలో మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రకృతిని ఆరాధిస్తూ ఆధ్యాత్మికతను చాటారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహలు మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా, జీవరాశి అంతానికి కారణమవుతున్నాయని వెల్లడించారు.
ఇవీచూడండి: అటు 'యాపిల్' గణేశుడు.. ఇటు 'బాదం' గణనాథుడు