ETV Bharat / state

చిరుతపులిని భయపెట్టిన ఆదిలాబాద్ రైతు - Leopard in Adilabad District

leopard-in-adilabad-district
ఆదిలాబాద్​ జిల్లాలో చిరుతపులి కలకలం
author img

By

Published : Jan 30, 2020, 9:53 AM IST

Updated : Jan 30, 2020, 12:23 PM IST

09:49 January 30

చిరుతపులిని భయపెట్టిన ఆదిలాబాద్ రైతు

చిరుతపులిని భయపెట్టిన ఆదిలాబాద్ రైతు

ఈ మధ్య కాలంలో జిల్లా శివార్లలో చిరుతల సంచారం పెరిగింది. పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి. పొలం పనులకు వెళ్లే రైతులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం భయపడుతునే ఉన్నారు. కానీ ఆదిలాబాద్​లో ఓ రైతు చిరుతనే భయపెట్టాడు. 

అసలేం జరిగిందంటే?

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటి గ్రామ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అర్లి పంచాయతీ శాంతి నగర్​కు చెందిన గిరిజన రైతు ఆత్రం రామ్ కిషన్ ఉదయం వేళ ఎద్దులను పంట చేనుకు తీసుకెళ్లి పనిలో నిమగ్నమవగా చిరుత పులి వచ్చి ఓ ఎద్దుపై దాడి చేసింది. ఇది గమనించిన సదరు రైతు అడవి పందులను పారదోలేందుకు ఉపయోగించే టపాసులను చిరుతపై వేసి అది పారిపోయేలా ధైర్యం ప్రదర్శించారు. ఆ ప్రయత్నం సఫలం కావడం వల్ల చిరుత పశువును వదిలి పారిపోయింది. దీనితో పశువుతో పాటు తన ప్రాణాలు దక్కించుకున్నట్లు బాధిత రైతు పేర్కొన్నారు.సమాచారం అందుకున్న ఫారెస్ట్​ అధికారులు చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 

Last Updated : Jan 30, 2020, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.