ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం విగ్రహానికి ఆదిలాబాద్‌లో తెరాస నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భీం 80 వ వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టర్ చౌక్‌లో ఉన్న విగ్రహానికి ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ గోడం నగేష్, పలువురు నేతలు నివాళులర్పించారు. కుమురం భీం ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆదివాసి బిడ్డకు అక్షర నీరాజనం..