స్వాతంత్ర సమరయోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి అనుసరణీయమని మాజీ మంత్రి, ఆదిలాబాద్ శాసనసభ్యుడు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లో అధికారికంగా నిర్వహించిన బాపూజీ 104వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా సంయుక్త పాలనాధికారి సంధ్యారాణి, పద్మశాలి సంఘం నేతలతో కలిసి బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు.. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండిః మృత్యువును జయించిన 10నెలల పసికందు