ఆదిలాబాద్ జిల్లా బాసరలో గోదావరి నది వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గత మూడు రోజులుగా ఎగువన ఉన్న మహారాష్ట్రలో వర్షాలు కురవడం వల్ల భారీ స్థాయిలో వరద నీరు బాసర తీరాన్ని చేరుతోంది. ఎగువ నుండి భారీ నీటి ప్రవాహం రావడంతో జాలర్లు నదిలోకి వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. గడిచిన 12 గంటల వ్యవధిలో గోదావరిలో 5 మెట్ల వరకు వరద నీరు పెరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఇవీ చూడండి: ఇకపై వ్యవసాయానికి మాత్రమే వ్యవసాయ రుణాలు