ETV Bharat / state

Fake seeds: ఫర్టిలైజర్స్ దుకాణాల అనుమతి రద్దు

author img

By

Published : Jun 9, 2021, 10:56 PM IST

నకిలీ విత్తనాల (Fake seeds)పై ఈటీవీభారత్-ఈనాడు (Etv bharat-eenadu)లో ప్రసారమైన కథనానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) స్పందించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రైతులకు సోయా విత్తనాలను విక్రయించిన రెండు విత్తన, ఎరువుల దుకాణాల అనుమతిని వ్యవసాయశాఖ రద్దు చేసింది.

fake
fake

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రైతులకు సోయా విత్తనాలను విక్రయించిన రెండో విత్తన, ఎరువుల దుకాణాల అనుమతిని (License) వ్యవసాయశాఖ (Agriculture Department)రద్దు చేసింది. ఆదిలాబాద్‌లోని అర్గుల్‌వార్‌ అగ్రో ఏజెన్సీ ద్వారా సోయా విత్తన సంచులపై ఉన్న అసలు ధర రూ. 3,100లను ఎవరికీ అనుమానం రాకుండా మార్కర్‌తో చెరిపేసి రూ.3,900 విక్రయించగా నిఖిల్‌ ఫర్టిలైజర్‌ యజమాని ఒకడుగు ముందుకేసి... సోయా విత్తనాలు మొలకెత్తకపోతే దుకాణాదారులుగా తాము బాధ్యులం కాబోమని ఏకంగా బిల్లులపైనే ముద్రించి రైతులకు విక్రయించారు.

ఈ వ్యవహారంపై ఈటీవీభారత్-ఈనాడులో ప్రసారమైన కథనానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి (Minister Niranjan reddy) స్పందించారు. టాస్క్‌ఫోర్స్ అధికారులను విచారణకు ఆదేశించగా రెండు దుకాణాల యజమానులు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. అర్గుల్‌వార్‌ ఆగ్రో ఏజెన్సీ, నిఖిల్‌ ఫర్టిలైజర్‌ దుకాణాల అనుమతి రద్దు చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి రమేశ్ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం బాధిత రైతులకు నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తామని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.