ETV Bharat / state

ధరణి పోర్టల్​లో పొరపాటు.. ఆ ఊరికి గ్రహపాటు

Dharani portal: ఆ గ్రామం ఏర్పడి దాదాపు 25 ఏళ్లు దాటింది. మూడేళ్ల కిందట పంచాయతీగా కూడా అవతరించింది. సాఫీగా గడుస్తున్నా ఆ ఊరి ప్రజల పాలిట సర్కారు తెచ్చిన ధరణి శాపంగా మారింది. గ్రామస్థులు ఉంటున్న భూమి అంతా తమదేనని ఊరు ఖాళీ చేయాలంటూ ధరణిలో పట్టాదారుగా ఉన్న వ్యక్తి బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఆ భూములన్నీ కొన్నామంటూ పల్లెవాసులు గోడు వెల్లబోసుకున్నా పట్టించుకోవట్లేదు. దీంతో చేసేదేమీలేక బాధితులంతా ఆందోళన చేస్తూ కలెక్టర్‌ను ఆశ్రయించారు.

సావర్గాం గ్రామం
సావర్గాం గ్రామం
author img

By

Published : Jul 2, 2022, 6:21 PM IST

ధరణి పోర్టల్​లో పొరపాటు.. ఆ ఊరికి గ్రహపాటు

Dharani portal: ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం సావర్గాం గ్రామస్థులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. స్థానిక ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి కొన్న భూములకు ధరణి పోర్టల్‌లో పట్టాదారు పేరు మారకపోవడంతో అనేక సమస్యలు తలెత్తాయి. ఏళ్ల కిందట ఏర్పడిన ఊరును ఖాళీ చేయలంటూ పట్టాదారు కోర్టును ఆశ్రయించాడు. ఆ భూమి తమదేనంటూ అందుకు ధరణిలో ఉన్న పట్టాపాసుపుస్తకమే సాక్ష్యామంటూ చూపించాడు.

రెవెన్యూ దస్త్రాల్లో గతంలో ఊరు కోసం కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ మార్చకపోవడంతో పట్టాదారుకు అనుకూలంగా మారింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఊరంతా ఖాళీ చేయమని అతడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆందోళన చెందిన గ్రామస్థులు కలెక్టరేట్‌ ముందు తమకు న్యాయం చేయాలంటూ కార్యాలయం ముందు బైఠాయించారు. కలెక్టర్‌ను కలసి తమ గోడును వినిపించారు. పట్టాదారు పట్టాను ధరణి పోర్టల్‌లో కనిపించకుండా రద్దు చేయాలని కలెక్టర్​ని కోరారు. తమకు భూమిని విక్రయించిన పట్టాదారు చనిపోయారని.. ఆయన వారసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు వెనుదిరిగారు.

గతంలో క్రయవిక్రయాలకు సంబంధించి గ్రామస్థులు రెవెన్యూ దస్త్రాల్లో మార్పులు చేసుకోకపోవడంతో.. ధరణిలో ఇంకా పాత పట్టాదారు పేర్లే దర్శనమిస్తున్నాయి. ఫలితంగా కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి. ధరణి సేవలతో సమస్యలు తీరుతాయనుకుంటే కొత్త సమస్యలు తెరపైకి రావడం ఆదిలాబాద్‌ జిల్లాలో చర్చనీయాశంగా మారింది.

"అక్కడ భూమిని కొన్నాం. ఇళ్లు కట్టుకున్నాం. బడి ఉంది. గ్రామపంచాయతీ ఏర్పాటైంది. ఇప్పుడు పట్టాదారు వచ్చి మమల్ని గ్రామం విడిచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. అందుకే మాగోడును కలెక్టర్​కు విన్నవించాం." -గ్రామస్థులు

"సావర్గాం గ్రామపజలు ఊరు కోసం భూమిని కొన్నారు. అప్పుడు విక్రయించిన పట్టాదారు చనిపోయారు. ఇప్పుడు వారి వారసులు వీరిని ఊరు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. అందుకే మేము కలెక్టర్​ను కలవడం జరిగింది. వారి పేరు మీద ఉన్న పట్టాను రద్దు చేయాలని కోరాం." -సుధీర్ న్యాయవాది

ఇదీ చదవండి: 'సమస్యలపై చర్చించకుండా ప్లెక్సీలతో చిల్లర రాజకీయం చేస్తున్నారు..'

వింత చోరీ.. ఇంట్లోకి అవసరమైన వాటినే ఎత్తుకెళ్లిన దొంగలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.