విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు టింకరింగ్ ల్యాబ్‌లు ఎంతగానో సహాయపడతాయని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలో నీతిఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు.
జిల్లా వ్యాప్తంగా ఏడు పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను కేటాయించిందని డీఈవో రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన పరికరాలను, ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. వాటి పనితీరును, ఉపయోగాన్ని విద్యార్థులు ఆయనకు వివరించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ పక్షానే ఉన్నారు : హరీశ్ రావు