ETV Bharat / state

'గిరి' యువతను ఊరిస్తున్న ఉపాధి..

మారుమూల గ్రామాల్లో నివసిస్తూ.. పేదరికంలో మగ్గుతూ.. ఖాళీగా ఉంటున్న గిరిజన యువతకు ‘గ్రామీణ రవాణా పథకం’ ద్వారా వాహనాలను అందజేసి స్వయం ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. సర్కారు ఆలోచన బాగానే ఉన్నా.. అమల్లో చిత్తశుద్ధి కొరవడుతోంది. లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. పథకం అమల్లో భాగంగా వాహనాల కోసం ఇచ్చే రుణాలకు సంబంధించి గిరిజన కార్పొరేషన్‌ (ట్రైకార్‌)నుంచి  రాయితీ నిధులు విడుదల కాకపోవడం వల్ల పథకం అమల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.

delay in traikar fund release
author img

By

Published : Jul 12, 2019, 9:02 AM IST

సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూరు ఆధ్వర్యంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జిల్లాలో నిరుద్యోగ గిరిజన యువతకు గ్రామీణ రవాణా పథకం (ఆర్టీపీ) కింద డ్రైవింగ్‌ శిక్షణ కల్పించి స్వయం ఉపాధి కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ.5.76 కోట్లతో 200 మందికి రాయితీపై బ్యాంకుల సహయంతో రవాణా వాహనాలను అందజేసే దిశగా కార్యచరణకు శ్రీకారంచుట్టింది.

అర్హుల ఎంపిక..

రవాణా వాహనాల మంజూరు కోసం అర్హులైన గిరిజన యువకులను ఎంపిక చేసేందుకు ఐటీడీఏ పీఓ పర్యవేక్షణలో ఏపీఓ జనరల్‌, ఎల్డీఎం, ఎంవీఐ, గిరిజన సంక్షేమశాఖ ఈఈలతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పేద కుటుంబానికి చెందిన గిరిజన యువకుడై ఉండి, గతంలో ఎలాంటి రాయితీ రుణం తీసుకొని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు కనీసం ఎనిమిదో తరగతి చదివిన వారు అర్హులుగా గుర్తించాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వందల దరఖాస్తులు రాగా వాటిని క్షుణ్నంగా పరిశీలించి అర్హులైన 200 మందికి ఎంపిక చేశారు.

ఇచ్చే వాహనాలివే..

గ్రామీణ రవాణా పథకం కింద అర్హులైన నిరుద్యోగ గిరిజన యువత కోసం ఐటీడీఏ అధికారులు టాటా ఏస్‌, అశోక్‌ లైలాండ్‌, మహీంద్ర బోలెరో, టాటా ఎస్‌ఎఫ్‌సీ పికప్‌ వంటి నాలుగు రకాల రవాణా వాహనాలను గుర్తించారు. వాటిలో ఏదో ఒక వాహనం మంజూరు చేయాల్సి ఉంది. వాహన రుణం కోసం ఎంపిక చేసిన యువకుడు తప్పనిసరిగా వ్యక్తిగత వాటా కింద రూ.50 వేలు బ్యాంకులో జమా చేయాలి.

ఇదీ లెక్క..

గిరిజన యువతకు మంజూరు చేసే వాహనం కోసం ప్రతి ఒక్కరికి రూ.2.88 లక్షల రాయితీని గిరిజన కార్పొరేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. లబ్ధిదారుడు వ్యక్తిగత వాటా కింద 10 శాతం తక్కువ కాకుండా కనీసం ఒక్కొక్కరు రూ.50వేలు బ్యాంకులో జమ చేయాలి. రాయితీ నిధులు, వ్యక్తిగత వాటా పోను మిగిలిన సొమ్మును బ్యాంకు రుణసాయం కింద గిరిజన యువకులకు చెల్లిస్తుంది. బ్యాంకు అధికారులు చూపిన విధంగా కిస్తుల వారీగా లబ్ధిదారులు బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఇంకెనాళ్లు..?

ముందే నిరుద్యోగులు. చేతిలో డబ్బులు లేక వాహనాల కోసం తెలిసినవారి దగ్గర కొందరు మరికొందరు వడ్డీకి తెచ్చి వ్యక్తిగత వాటా కింద బ్యాంకులో జమ చేసి రెండేళ్లవుతున్నా.. ఇప్పటికీ వాహనాలు మాత్రం అందజేయలేదు. గిరిజన కార్పొరేషన్‌ నుంచి రాయితీ నిధులు విడుదల కాకపోవడం వల్ల బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయకపోవడం వల్ల పథకం అమలుకు నోచుకోవడం లేదు. తమ సమస్యను ఎవరు పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని గిరిజన కార్పొరేషన్‌ నుంచి రాయితీ నిధులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.