ఇకపై రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే అక్కడే గృహం నిర్మించుకోవచ్చని అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. ఇందుకు సంబంధించిన జీఓ త్వరలోనే రానుందని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం...
ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి, కచ్‌కంటి, యాపల్‌గూడ గ్రామాల్లో పలు అభివృద్ది పనులను ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. కొవిడ్ కారణంగా రెండు పడకగదుల ఇళ్ల మంజూరు ఆలస్యమవుతోందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి : వరదల నష్టాన్ని.. సీఎం దృష్టికి తీసుకెళ్తా : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు