ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలో శ్రీ ధర్మశాస్త అయ్యప్ప ఆలయం ఆధ్వర్యంలో ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్పస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి పల్లకి సేవగా గ్రామంలోని వీధుల్లో శోభాయాత్ర చేపట్టారు. స్వామి శరణు ఘోషలతో ఊరేగింపు జరిపి నృత్యాలు చేశారు. అనంతరం అయ్యప్ప విగ్రహాన్ని కడెం నదికి తీసుకెళ్లి చక్రస్నానం చేయించారు. కార్యక్రమంలో అయ్యప్ప దీక్ష స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్ ఎక్కడిది?