సెలవు రోజుల్లో వేతనాల కోత విధించడానికి తీసుకొచ్చిన జీవో నెంబర్ 8ను రద్దు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు జీవో ప్రతులను దగ్ధం చేశారు. ప్రభుత్వ తీరు ఎండగడుతూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో ర్వాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటమ్మ, సునీత పాల్గొన్నారు.
ఇవీ చూడండి: శుభవార్త: మరో రెండు రోజుల్లో వర్షాలు !