Amit Shah Speech in Adilabad BJP Public Meeting : డిసెంబరు 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా(Telangana BJP) ఎగురుతుందని.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే అధికారం చేపడుతుందని కేంద్రహోంమంత్రి అమిత్ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆదిలాబాద్‌లోని బీజేపీ జనగర్జన సభ (BJP Public Meeting in Adilabad) పాల్గొన్న అమిత్ షా.. అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు.
"పవిత్ర భూమి అయినటువంటి ఆదిలాబాద్‌కు వచ్చాను. కుమురం భీం పేరు చెబితేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయనను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభిస్తాను. రజాకార్లపై పోరాడిన వీరభూమికి నమస్కారం చేస్తున్నాను. కేసీఆర్ సర్కారు గిరిజన వర్సిటీకి జాగా చూపించకపోవడం వల్లే.. వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైంది. పదేళ్లుగా కేసీఆర్ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదు. ఈ రాష్ట్ర సీఎం.. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదు. కేసీఆర్ మాత్రం పదేళ్లుగా తన కుటుంబం కోసమే ఆలోచించారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం కోసమే.. నిరంతరం కేసీఆర్ ఆలోచించేవారని" కేంద్రహోంమంత్రి అమిత్‌షా అన్నారు.
Kishan Reddy Fires on CM KCR : 'కమలం వికసిస్తుంటే.. కేసీఆర్ గడబిడ అవుతున్నారు'
Amit Shah Fires on BRS and Congress : ఎన్నికలు రాగానే కాంగ్రెస్ వాళ్లు కొత్త బట్టలు వేసుకొని వస్తారని కేంద్రహోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. ఆ పార్టీ పేదల గురించి మాట్లాడుతుంది కానీ.. పేదల కోసం ఏం చేయదని విమర్శించారు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ గిరిజనుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారని.. కానీ వాటిని ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఆదివాసీలకు సీఎం రెండు పడకల ఇళ్లు ఇస్తామని అన్నారు.. కానీ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ చేశామని కేసీఆర్ పదేపదే చెబుతుంటాని.. కేవలం రైతుల ఆత్మహత్యల విషయంలోనే తెలంగాణను నంబర్ వన్ చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎన్నికల గుర్తు కారు.. కానీ ఆ కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ దగ్గర ఉంటుందని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఎంఐఎం దగ్గర స్టీరింగ్ ఉన్న బీఆర్ఎస్ సర్కారు అవసరమా అంటూ ప్రజలను ప్రశ్నించారు.
"డిసెంబరు 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలి. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ సర్కార్ వైఖరి వల్ల గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైంది. గిరిజన వర్సిటీకి కేసీఆర్ సర్కారు జాగా చూపించలేదు. " - అమిత్‌షా, కేంద్రహోంమంత్రి
BJP Public Meeting in Adilabad : అనంతరం బీజేపీ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ.. మోదీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించందని చెప్పారు. కృష్ణా ట్రైబ్యునల్ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బందులు లేకుండా ప్రధాని చేశారని గుర్తు చేశారు. ప్రతి పేద మహిళకు వంట సిలిండర్ ఇచ్చామని.. రైతుల ఖాతాల్లో ఏటా రూ.6వేలు జమ చేస్తున్నామన్నారు. దళితులు, గిరిజనుల కోసం మోదీ 9 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ బహిరంగ సభలో తరుణ్‌ఛుగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్, ఈటల రాజేందర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Bandi Sanjay Comments on KCR : దమ్ముంటే.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి: బండి సంజయ్